కళ్లు పెద్దవిగా కనిపించేందుకు!

అందమే ఆనందం

To Make Eyes Bigger
To Make Eyes Bigger

కళ్లు కనికట్టు చేస్తాయని తెలుసు అయితే కళ్లు పెద్దవిగా కనిపిస్తే ఆ అందమే వేరు. కళ్లు మాత్రమే ఫోకస్‌ అయ్యేలా మేకప్‌ చేసుకుంటే కళ్లను పెద్దవిగా కని పంచేలా చేయొచ్చు.

అదెలాగంటే..కనుబొమలను ఐ బ్రో పెన్సిల్‌తో చక్కగా సింగారించుకుంటే కనులు పెద్దవిగా కనిపిస్తాయి.
కనుబొమలకు అవసరమైతే పెట్రోలియం జెల్లీ కూడా రాసుకోవచ్చు. చివరగా కన్‌సిలర్‌ ఉపయోగిస్తే కన్నుబొమ్మలు ఆకర్షణీయంగా మారి కళ్లు పెద్దవిగా కనిపిస్తాయి.

To Make Eyes Bigger

హైలైటర్‌ ఉపయోగిస్తే పెద్దవిగా కనిపిస్తాయి. కన్‌సీలర్‌ మెరుస్తూ ఉండే హైలైటర్‌ను కొద్దిగా కళ్ల కింద రాసుకోవాలి. ఇలా చేస్తే కళ్లు హైలైట్‌ అవుతాయి. పెద్దవిగా, మెరుస్తూ కనిపిస్తాయి. ్ద కళ్ల చుట్టూ ఐ లైనర్‌ రాసుకోవాలి. కింది కనురెప్పలను మాత్రం అలాగే వదిలేయాలి.

కళ్ల లోపలి అంచుల వెంబడి వైట్‌ ఐ లైనర్‌ రాసుకున్నా కూడా కనులు ఆకట్టుకునేలా మారతాయి.
కనురెప్పలను ఐలాష్‌ కర్లర్‌తో వాటిని ఒకవైపు తిప్పాలి. తరువాత కాటుక కొంచెం ఎక్కువ రుద్దుకుంటే కళ్లు పెద్దగా కనిపిస్తాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/