వైరాలజీ కోర్సు చేయాలంటే

ఉపాధి కల్పనా కోర్సులు

virology course
virology course

వివిధ రకాల పరీక్షలు చేయడం, వాటి ఫలితాలను విశ్లేషించడం, ఒక నిర్ణయానికి రాగలగడం వంటి నైపుణ్యాలు విద్యార్థులకు ఉండాలి.

పరీక్షల ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వైద్యులు, ఆరోగ్యసంస్థలు, ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని మెరుగైన సమాచారాన్ని సేకరించాలి. ఇందుకోసం మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం.

ప్రయోగశాల పరికరాలను పూర్తిస్థాయిలో ఉపయోగించడం (మాలిక్యులర్‌ బయాలజీ స్కిల్స్‌) తెలిసి ఉండాలి.

ఎవరు అర్హులు: బిఎస్సీలో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం ఒకటి లేదా బివిఎస్సీ లేదా ఎంబిబిఎస్‌ కోర్సులు చదువుతున్నవారు ఎమ్మెస్సీ వైరాలజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రో బయాలజీ కోర్సులో అంతర్భాగంగా వైరాలజీ ఉంటుంది.

యూజీస్థాయిలో వైరాలజీని ప్రత్యేక సబ్జెక్టుగా అందించడం లేదు. అందువల్ల భవిష్యత్తులో వైరాలజిస్టులు కావాలనే ఆశయం ఉన్నవాళ్లు డిగ్రీలో మైక్రోబయాలజీని ఒక సబ్జెక్టుగా తీసుకుంటే మంచిది.

మైక్రోబయాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ సబ్జెక్టుల్లో నచ్చిన కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు.

ఎన్‌ఐవిలో చదవడానికి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 60శాతం మార్కులు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్నవారికి 55శాతం మార్కులు సరిపోతాయి.

ప్రవేశ పరీక్ష విధానం:

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ఎమ్మెస్సీ చేయాలంటే ప్రవేశపరీక్ష రాయాలి. ఇది 200 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు.

ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్‌, మెడికల్‌ సైన్స్‌, లైఫ్‌సైన్స్‌ సబ్జెక్టుల నుంచి ఉంటాయి.

తప్పుగా గుర్తించిన సమాధానానికి అరమార్కు తగ్గిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.
https://www.niv.com.in/

కోర్సులు అందిస్తున్న సంస్థలు

వైరాలజీపై అధ్యయనం కోసం ఒక ప్రత్యేక సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవి)ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో పుణెలో ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం కరోనా అనుమానిత శాంపిల్స్‌ను అక్కడికి పంపుతున్నారు.

ఇందులో ఎమ్మెస్సీ, పిహెచ్‌డి స్థాయుల్లో వైరాలజీ కోర్సులు ఉన్నాయి. సావిత్రీబాయి పులే ఫుణే యూనివర్సిటికి అనుబంధంగా వీటిని అందిస్తున్నారు

. తెలుగురాష్ట్రాల్లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సును అందిస్తోంది.

ఈ రెండు సంస్థల్లో ప్రవేశాలకు త్వరలో ప్రకటనలు వెలువడనున్నాయి. మణిపాల్‌ సంస్థ ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సును నిర్వహిస్తోంది. మే 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అమితీసంస్థ నోయిడా క్యాంపస్‌లో వైరాలజీలో ఎమ్మెస్సీ, పిహెచ్‌డి కోర్సులు ఉన్నాయి.

మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రకటన వెలువడుతుంది. విదేశాల్లో, యూఎస్‌లో హార్వర్డ్‌, పెన్సిల్వేనియా, షికాగో, విస్కాన్సిన్‌-మాడిసన్‌, ఓహియో స్టేట్‌, శాన్‌ఫ్రాన్సిస్‌కో యూనివర్సిటీలు వైరాలజీ చదువులకు ప్రసిద్ధి.కెనడాలో టొరంటో, బ్రిటిష్‌ కొలంబియా, మెక్‌గిల్‌, కాల్గరీ, ఆల్బర్టా, క్యుబెన్‌ విశ్వవిద్యాలయాల్లోనూ ఈ కోర్సులు చదువుకోవచ్చు.

ఉద్యోగాలు ఎక్కడ:?

ఫార్మాసంస్థలు, పరిశోధన సంస్థలు, వ్యాక్సీన్‌ తయారీ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల్లో వైరాలజిస్టు, రీసెర్చ్‌ అసోసియేట్‌, లెబొరేటరీ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగావకాశాలు ఉంటాయి.

ఎన్‌ఐవిలో చదువుకున్నవారిని భారత్‌ బయోటెక్‌, యాక్టిస్‌ బయోలాజిక్స్‌, నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హిందూస్థాన్‌ యూనీలీవర్‌, వెంకటేశ్వర హ్యాచరీస్‌ మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/