ఉన్నత విద్యకు ప్రత్యామ్నాయ దేశాలెన్నో…

Alternative countries for higher education…

అమెరికాలో ఆంక్షలు, కెనడాలో ఖర్చుల దృష్ట్యా మన విద్యార్థులు యూకె బాటపడుతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21,165 మంది భారతీయ విద్యార్థులు యూకె స్టూడెంట్‌ వీసాలు సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య 40 శాతం పెరగడం గమనార్హం. బ్రెగ్జిట్‌ తదనంతర పరిణామాలతో యూకెలో పోస్ట్‌స్టడీ వర్క్‌ అవకాశాలు మెరుగవుతున్నాయి. పిహెచ్‌డి పూర్తి చేసుకున్నాక ఏడాదిపాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ చేయొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలంటే అమెరికా దేశమే గుర్తుకు వస్తుంది చాలామందికి. కానీ ఇప్పుడు అమెరికా దేశానికి దీటైన ప్రత్యామ్నాయ దేశాలెన్నో ఉన్నాయి. వాటిని గమనిద్దాం.

ఫ్రాన్స్‌ దేశంలో..:

ఫ్రాన్స్‌ ప్రత్యేక విధానాలను అమలు చేస్తోంది. 2020 నాటికి పదివేల మంది భారత విద్యార్థులకు స్టూడెంట్‌ వీసాలు మంజూరు చేయాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఫ్రాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు దరఖాస్తు చేసుకుంటే వీసా సులువుగా మంజూరవుతోంది. 2017లో ఫ్రాన్స్‌ స్టూడెంట్‌ వీసాలు పొందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 4,500 కాగా ఆ సంఖ్య 2018లో ఎనిమిదివేలకుపైగా ఉంది. అకడమిక్స్‌పరంగా చూస్తే హ్యుమానిటీస్‌, ఆర్ట్స్‌ కోర్సులకు ఫ్రాన్స్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. మనదేశ విద్యార్థుల్లో అధికశాతం మంది మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల్లోనే చేరుతున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. పోస్ట్‌స్టడీ వర్క్‌ విషయంలో రెండేళ్ల మాస్టర్‌ కోర్సు, పూర్తయిన తర్వాత విద్యార్థులు రెండేళ్లపాటు అక్కడే కొనసాగి ఉద్యోగాన్వేషణ చేయెచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లభిస్తే స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఆధారంగా తొలుత రెండేళ్ల కాల పరిమితితో వర్క్‌పర్మిట్‌ మంజూరు చేస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.

వివరాలకు వెబ్‌సైట్‌: https://www.inde.campusfrance.org/

ఆస్ట్రేలియా అవకాశాలెన్నో:

భారత విద్యార్థులకు మరో ప్రధాన ప్రయత్యామ్నాయ గమ్యం ఆస్ట్రేలియా. గతేడాది ఆ దేశానికి వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 60వేలకు పైగా ఉంది. 2017తో పోల్చితే 2018లో ఆ సంఖ్యలో 14శాతం వృద్ధి నమోదైంది. అకడమిక్‌ కోర్సులతోపాటు పోస్ట్‌స్టడీ వర్క్‌పరంగా ఆస్ట్రేలియా అనుసరిస్తున్న సరళీకృత విధానాలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇంజినీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీతోపాటు మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ కోర్సులను అందించడంలో ఆస్ట్రేలియాలోని ఇన్‌స్టిట్యూట్‌లకు మంచి పేరుంది. రెండేళ్ల వ్యవధిగల కోర్సులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులకు పోస్ట్‌స్టడీ వర్క్‌ వీసాలను సులువుగా మంజూరు చేస్తోంది. ఆ క్రమంలో టెంపరరీ గ్రాడ్యుయేట్‌ వర్క్‌ స్ట్రీమ్‌ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా అమలు చేస్తోంది. దీని ప్రకారం రెండేళ్ల వ్యవధిలో గల కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి సంబంధిత రంగంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే తొలుత ఏడాదిన్నర (18 నెలల) కాలపరిమితి ఉండే వర్క్‌ వీసా మంజూరు చేస్తారు. మరోవైపు పోస్ట్‌స్టడీ వర్క్‌స్ట్రీమ్‌లో భాగంగా కనిష్ఠంగా రెండేళ్లు, గరిష్టంగా నాలుగేళ్లు ఆస్ట్రేలియాలోనే పనిచేసే అవకాశం ఉంది.

వెబ్‌సైట్‌: https://www.border.gov.au

అద్భుతమైన సింగపూర్‌లో :

విదేశీ విద్య ఔత్సాహికులకు అన్ని రకాలుగా సానుకూల గమ్యంగా సింగపూర్‌ను పేర్కొనొచ్చు. ఇక్కడి యూనివర్సిటీలకు అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్‌లతో ఉన్న ఒప్పందాల ఫలితంగా డ్యూయల్‌ డిగ్రీ, జాయింట్‌ డిట్రీ ప్రోగ్రామ్‌లు చేసే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం ఏటా 35వేల మంది విదేశీ విద్యార్థులు సింగపూర్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 15 శాతం నుంచి 20శాతం ఉంటోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనే అధికశాతం విద్యార్థులు చేరుతున్నారు. కోర్సు పూర్తియ్యాక ఏడాదిపాటు పోస్ట్‌స్టడీ వర్క్‌ పేరుతో అక్కడే పనిచేసే అవకాశముంది. ఆ తర్వాత కూడా ఎంప్లాయర్‌ స్పాన్సర్‌షిప్‌లెటర్‌ ఆధారంగా పొడిగించుకోవచ్చు.

పూర్తి వివరాలకు: https://www.singaporeedu.gov.sg

జపాన్‌ టెక్నాలజీకి పెట్టింది పేరు:

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన దేశం. జపాన్‌ ప్రధానంగా సైన్స్‌, ఇంజనీరింగ్‌ కోర్సులకు నెలవు ఇక్కడి ఇన్‌స్టిట్యూట్‌లు. గతేదాది దాదాపు 10వేల మంది భారతీయ విద్యార్థులు జపాన్‌ విద్యాసంస్థల్లో అడుగుపెట్టారు. జపాన్‌లో పోస్ట్‌స్టడీ వర్క్‌ సరళీకృత విధానాలు అమలవుతున్నాయి. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేంఉదకు ఆరునెలలు అక్కడే నివసించే అవకాశముంది. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఆధారంగా తొలుత మూడేళ్ల వ్యవధికి వర్క్‌ వీసా మంజూరు చేస్తారు.

పూర్తి వివరాలకు: https://www.jasso.go.jp

బ్రిటన్‌ ఉద్యోగాన్వేషణకు వీలు:

విదేశీ విద్యపరంగా యూకె వైపు మొగ్గు చూపుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఆంక్షలు, కెనడాలో ఖర్చుల దృష్ట్యా మన విద్యార్థులు యూకె బాటపడుతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21,165 మంది భారతీయ విద్యార్థులు యూకె స్టూడెంట్‌ వీసాలు సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య 40 శాతం పెరగడం గమనార్హం. బ్రెగ్జిట్‌ తదనంతర పరిణామాలతో యూకెలో పోస్ట్‌స్టడీ వర్క్‌ అవకాశాలు మెరుగవుతున్నాయి. యూజీ, పిజీ విద్యార్థులు కోర్సు ఉత్తీర్ణత తర్వాత ఆరునెలలు, పిహెచ్‌డి పూర్తి చేసుకున్నాక ఏడాదిపాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ చేయొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లభిస్తే టైర్‌-2 వర్క్‌ వీసా సులువుగా మంజూరవుతుంది. దీనిద్వారా గరిష్టంగా అయిదేళ్లు యూకెలో నివశిం చొచ్చు. టైర్‌-2 విధానంలో అక్కడే ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అనుమతి లభిస్తుంది.

మలేషియా యూకె తరహా బోధన:

మలేషియా అకడమిక్‌ కరిక్కులంపరంగా యూకె తరహా బోధన విధానాన్ని అనుసరిస్తోంది. గతేడాది మలేషియా యూనివర్సిటీల్లో చేరిన విదేశీవిద్యార్థుల సంఖ్య లక్షన్నర. ఇది అక్కడి ఇన్‌స్టిట్యూట్‌ల పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. ఇక్కడ పిజి కోర్సుల వ్యవధి ఏడాదిన్నర. వీటిని పూర్తిచేసుకున్న అభ్యర్థులకు కేటగిరి-1,2,3 పేరుతో మూడు రకాల పోస్ట్‌స్టడీవర్క్‌ పర్మిట్ల విధానం అమల్లో ఉంది.
కేటగిరి-1లో నెలకు కనిష్ఠంగా 5వేల రింగిట్‌ల జీతం సొంతం చేసుకున్న వారికి అయిదేళ్ల ఎంప్లాయిమెంట్‌ పాస్‌ లభిస్తుంది. నెలకు అయిదువేల లోపు రింగిట్‌ల వేతనంతో రెండేళ్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగం పొందిన వారికి కేటగిరి-2 ఎంప్లా§్‌ుమెంట్‌ పాస్‌ లభిస్తుంది. ఉద్యోగ కాలపరిమితి ఏడాది లోపు, వేతనం 2,500-4,999 రింగిట్లు ఉంటే కేటగిరి- 3 ఎంప్లా§్‌ుమెంట్‌ పాస్‌ మంజూరవుతుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com