కృష్ణంరాజు మృతికి కారణం తెలిపిన హాస్పటల్ వర్గం

This is the cause of Krishnam Raju death

రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఈరోజు ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త తెలిసి యావత్ సినీ ప్రేక్షకులే కాదు రాజకీయ ప్రముఖులు సైతం షాక్ కు గురయ్యారు. అసలు ఏమైంది..ఎందుకు చనిపోయాడని ఆరా తీయడం మొదలుపెట్టారు. కృష్ణం రాజు మృతి పట్ల హాస్పటల్ వర్గం క్లారిటీ ఇచ్చింది.

“కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ వల్ల చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన వైద్యం చేశాం. ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు కన్నుమూశారు” అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు చిత్రసీమలో రెబల్‌ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. ప్రభాస్ తో కలిసి పలు సినిమాల్లో నటించారు. చివరగా ఆయన నటించింది రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ కావడం విశేషం.