సారథల మార్పును ఆలోచించండి

తెరపైకి ఇద్దరు కెప్టెన్‌ల అంశం

kohli&rohit
kohli&rohit

న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ న్యూజిలాండ్‌ సీరీస్‌లో ఘోరంగా విఫలమవడంతో మరోసారి ఇద్దరు కెప్టెన్‌ల అంశం తెరపైకి వచ్చింది. గతంలో రోహిత్‌ శర్మకు పొట్టి క్రికెట్‌లో మంచి రికార్డు ఉండడంతో జట్టు సారథ్య భాధ్యతలను విభజించాలపనె డిమాండ్‌ మళ్ళి చర్చకు వస్తుంది. ఇప్పటికే ఐపీఎల్‌లో సక్సెస్‌పుల్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ ముంబై ఇండియన్స్‌కు 4 టైటిల్స్‌ అందించాడు. కాని కోహ్లి కెప్టెన్సిలో రాయల్‌ చాలెంజర్‌ బెంగళూరు మాత్రం ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవలేదు. అయితే ఈ ఇద్దరు కెప్టెన్ల విషయం తాజాగా భారత మాజీ చీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ముందుంచగా భారత క్రికెట్‌లో ఇది పని చేయదని స్పష్టం చేశాడు. అయితే కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌ కుమార్‌ మాత్రం కోహ్లికీ అన్ని ఫార్మాట్‌లో సారథిగా రాణించగలడని అభిప్రాయపడ్డాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/