ఆర్‌సిబి టైటిల్‌ గెలవకపోవడానికి కారణం అదే.. కోహ్లీ

మూడూ సార్లు ఫైనల్‌కు చేరిన కూడా అదృష్టం వరించలేదు

virat kohli
virat kohli

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌ (ఐపిఎల్‌) లో రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవక పోడానికి కారణం ఏమిటో జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లు ఉండడం వల్ల అభిమానుల్లో మాపై ఎప్పుడు భారీ అంచనాలు ఉంటాయి. ఈ సారైనా గెలుస్తారంటూ అభిమానులు అనుకోవడం వల్ల ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి నెలకోంటుంది. మూడు సార్లు పైనల్‌ చేరినప్పటికి.. అదృష్టం కలిసి రాలేదు అని కోహ్లీ తెలిపాడు. కాగా ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ మాజి కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో లైవ్‌చాట్‌లో కోహ్లీ వెల్లడించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/