తెలంగాణలో వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలు

త్వరలోనే తేదీల ప్రకటన.. వెల్లడించిన డైరెక్టర్‌ సత్యనారాయణ

students
students

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ కోనసాగుతుండడం, వైరస్‌ వ్యాప్తి కూడా పెరుగుతుండడంతో, పదవ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే ఈ నెల 23 నుండి 30 వరకు జరగాల్సిన పరీక్షలు, హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడగా.. వీటిని ఈ నెల 31 నుండి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. కాని ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో రేపటి నుండి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పరీక్షల తేదీలను మరికొద్ది రోజులలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/