హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఉద్రిక్తత

వివాదాస్పద చిత్రాలకు , ట్వీట్స్ కు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..తాజాగా వ్యూహం అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు. ఇది రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ముందుగా ‘వ్యూహం’ పేరుతో మొదటి పార్ట్ ను ఈ నెల 29 న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్స్ , సినిమా తాలూకా విశేషాలు సినిమా ఫై ఆసక్తి పెంచాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో జగన్ ను హైలైట్ చేస్తూ..చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ , లోకేష్ లను కించపరుస్తూ తెరకెక్కించారని స్పష్టంగా తెలుస్తుండడం తో ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని నినాదాలు చేస్తు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు టీడీపీ, జనసేన శ్రేణులు. హైదరాబాద్ లోని వర్మ ఆఫీస్ వద్ద సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోలన చేపట్టారు. వర్మ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి , నిరసనకారులను అక్కడినుండి పంపించేశారు.