భారీ వర్షాలు..ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

కొడియాల వద్ద చిక్కుకున్న 1500 వాహనాలు, 20 వేల మంది యాత్రికులు

telugu-pilgrims-stuck-in-uttarakhand

డెహ్రాడూన్ః ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో వేలాదిమంది యాత్రికులు రోడ్లపై చిక్కుకుపోయారు. మరీ ముఖ్యంగా రిషికేశ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయిన వందలాదిమంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

యాత్రికులతోపాటు స్థానికులు కూడా రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, 20 వేలమంది యాత్రికులు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా వీరిలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ఉండగా వీరంతా ఇలా చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.