లండన్‌లో తెలుగమ్మాయి దారుణ హత్య

ఉన్నత చదువుల కోసం చాలామంది మన తెలుగు వారు ఇతర దేశాలకు వెళ్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అక్కడి నేరగాళ్ల చేతిలో బలైపోతారు. ముఖ్యముగా అమెరికాలో ఎంతోమంది ప్రాణాలు విడిచారు. తాజాగా లండన్‌లో ఓ తెలుగు అమ్మాయిని అతి దారుణంగా ఓ బ్రెజిల్‌ యువకుడు హత్య చేశాడు.

హైదరాబాద్‌లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో వారిపై ఓ బ్రెజిల్‌ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తేజస్విని అక్కడికక్కడే మృతి చెందగా…మరో తెలుగమ్మాయి అఖిల తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.