నటుడు సునీల్‌కు స్వల్ప అస్వస్థత

actor sunil
actor sunil

హైదరాబాద్‌: ప్రముఖ సినీ హాస్య నటుడు సునీల్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేరారు. ఆయనకు వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురైన విషయంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. విడుదలకు సిద్ధమైన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’లో సునీల్ నటించారు. కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ ఆయన పలు సినిమాల్లో నటించారు. ఓ సినిమాలో ఆయన విలన్ పాత్రలోనూ నటిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/