నిమ్స్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

NIMS HYd
NIMS HYd

హైదరాబాద్‌: పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకింది. అయితే దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి వుంది. కాగా, మంగళవారం ఉస్మానియా వైద్యకళాశాలలోని 12 మంది పిజి విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో వసతి గృహంలో మిగిలిన 284 మందిని క్వారంటైన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:htthttps://www.vaartha.com/andhra-