రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్‌ మార్కెట్లు ఏర్పాటు చేస్తాం

ఫిష్‌ ఫెస్టివల్‌లో 100 రకాల చేపల వంటకాలు

talasani srinivas yadav
talasani srinivas yadav

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ గార్డెన్‌లో ఫిష్‌ ఫెస్టివల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెస్టివల్‌లో 100 రకాల చేపల వంటకాలున్నాయన్నారు. బేగంబజార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మున్సిపల్ డివిజన్లలో ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రపంచమంతా చేపలు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకుంటామన్నారు. చేపలు, చికెన్ తింటే కరోనా వైరస్ రాదని మంత్రి తలసాని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/