కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పట్ల తెలంగాణ అప్రమత్తం

బ్రిటన్ నుంచి వచ్చిన వారికి ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు

Telangana alerted to new type of corona strain
Telangana alerted to new type of corona strain

Hyderabad: కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ పై  కేంద్రం సూచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని   తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు  చెప్పారు.

మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన  హైదరాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు.

గత వారం రోజులుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారికి ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తీవ్ర వ్యాధి లక్షణాలు ఉన్నా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/