కేరళ హైకోర్టును ఆశ్రయించిన సన్నీ లియోన్

మాజీ పోర్న్ స్టార్ , నటి సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. త‌న‌తో పాటు త‌న భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్‌, త‌న ఉద్యోగిపై న‌మోదైన చీటింగ్ కేసును కొట్టివేయాల‌ని కోరుతూ కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించారు. స‌న్నీలియోన్ స‌హా ఆమె భ‌ర్త‌, ఉద్యోగిపై కేర‌ళ‌లోని ఎర్నాకుళానికి చెందిన ఈవెంట్ మేనేజ‌ర్ శియాస్ కుంజుమ‌హ్మ‌ద్ కేసు దాఖ‌లు చేశారు.

నాలుగేళ్ల క్రితం ఓ కార్యక్రమం (ఈవెంట్)లో పాల్గొనేందుకు సన్నీలియోన్ కు రూ.లక్షలు చెల్లించానని, అయినా ఆమె హాజరు కాలేదంటూ మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సన్నీలియోన్, డానియల్ వెబెర్, వారి ఉద్యోగిపై సెక్షన్ 406, సెక్షన్ 420, సెక్షన్ 34 కింద అభియోగాలు నమోదు చేశారు. కానీ, ఇవన్నీ అసత్యాలని సన్నీ లియోన్ అంటోంది. ఇక తాజాగా ఈ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని పేర్కొంటూ త‌మ‌పై అభియోగాల‌ను కొట్టివేయా.ల‌ని కోరుతూ స‌న్నీలియోన్ కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు