మహా శివరాత్రి కానుకగా భోళా శంకర్ నుండి గ్లింప్స్‌ విడుదల

మహా శివరాత్రి కానుకగా భోళా శంకర్ నుండి గ్లింప్స్‌ విడుదల చేయబోతున్నారు మేకర్స్. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..అదే జోష్ తో భోళా శంకర్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మెహర్ రమేష్ – చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ వేదాళ‌మ్ రీమేక్‌గా వస్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈరోజు శివరాత్రి కానుకగా ఈ చిత్రంలోని మెగాస్టార్ గ్లింప్స్‌ను స్ట్రీక్ ఆఫ్ శంకర్ పేరిట ఈ సాయంత్రం 6 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.