శివశంకర్ మాస్టర్ మృతి: ప్రముఖుల సంతాపం

10 భాషల్లో 800 కి పైగా సినిమా పాటలకు కొరియోగ్రఫీ

Shivashankar Master -File
Shivashankar Master -File

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) మృతి చెందారు. . గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు విజయ్, అజయ్ ఉన్నారు. గత వారం కరోనా బారిన పడిన శివశంకర్ మాస్టర్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించగా, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పరిశ్రమలో కొందరు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. మెగాస్టార్ చిరంజీవి 3 లక్షల రూపాయలు తమిళ హీరో ధనుష్ 5 లక్షల రూపాయల అందించగా, సోనూ సూద్ అలాగే మంచు విష్ణు అండగా నిలబడ్డారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా శివ శంకర్ మాస్టర్ ను కాపాడ లేకపోయారు.

డిసెంబర్ 7, 1948 లో జన్మించిన శివ శంకర్ మాస్టర్ ‘పాట్టుం భరతముం’ చిత్రం తో అసిస్టెంట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. చిన్న వయసులోనే తన వెన్నుముక కి బలమైన గాయం తగిలి విరిగి పోవడం తో 8 సంవత్సరాల వరకు పడుకొనే ఉండటం జరిగింది.
బయట ప్రపంచం కి దూరంగా ఉంటూనే ఉన్నాడు. కుటుంబం లో స్త్రీలు తనను చూసుకోవడం జరిగింది. కుటుంబం లో తన తండ్రి కి కర్ణాటక సంగీతం మరియు జ్యోతిష్యం లో నైపుణ్యం ఉండటం తో డాన్స్ పై శివ శంకర్ మాస్టర్ కి అసక్తి కలిగింది.

10 భాషల్లో 800 కి పైగా సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు శివశంకర్ మాస్టర్. తెలుగు, తమిళం వంటి దక్షిణాది సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో రాజమౌళి, రామ్ చరణ్ మగధీర సినిమాలోని ‘ధీర ధీర పాట’కు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ‘బాహుబలి’ చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. టెలివిజన్ రంగంలో ఆట, జూనియర్స్, ఢీ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. .

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/