శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Srisailam Temple
Srisailam Temple

శ్రీశైలం: ఈరోజు నుండి శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 14వ తేదీ నుంచి 24 వరకు ఉత్సవాలకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల రాకపోకలకు వీలుగా 18 నుంచి 22వ తేదీ వరకు మన్ననూర్‌ అటవీ ప్రాంతంలో రాత్రి వేళలో రాకపోకలకు ఉన్న ఆంక్షలు తొలగించనున్నట్టు చెప్పారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/