కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన పట్ల మంత్రి సబితా కామెంట్స్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా..రేపు శనివారం తెలంగాణ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ పార్టీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి పలు కామెంట్స్ చేశారు. అమిత్ షా టూరిస్ట్ లాగా వచ్చి పోతా అంటే కుదరదని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఏమైందో చెప్పాలని..తెలంగాణకు ఒక్క విద్య సంస్థ ఇవ్వలేదని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా ? అని సబితా నిలదీశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వ‌చ్చి పోతామంటే కుద‌ర‌దు అని అమిత్ షా ప‌ర్య‌ట‌నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ప్ర‌క‌టించాల‌ని, విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల‌ని స‌బిత డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన హ‌క్కుల‌ను నెర‌వేర్చాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల త‌రపున అమిత్ షాను అడుగుతున్నామ‌ని తెలిపారు. విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌డం లేదు. ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ, రైల్వే కోచ్ ఊసే లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు ప‌ర‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్ప‌డానికి వస్తున్నారా? లేక ఏదైనా హామీ ఇచ్చి పోతున్నారా? అనే విష‌యంలో అమిత్ షా స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అలాగే బండి సంజయ్ పాదయాత్ర ఫై కూడా సబితా ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాద‌యాత్ర పేరిట ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేశాన‌ని త‌న‌ను ప్ర‌శ్నించే కంటే ముందు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా తెలంగాణ‌కు ఎన్ని నిధులు తెచ్చాడో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని స‌బిత డిమాండ్ చేశారు.