ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా ను ఖరారు చేసిన చిత్ర యూనిట్

ఉదయం నుండి ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు సంబదించిన వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కరోనా , ఓమిక్రాన్ కారణంగా సినిమాను వాయిదా వేయబోతున్నారనే వార్త బయటకు రావడం తో ఇది నిజమా కదా చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కదా..అని అంత మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఈ వార్త నిజమే అని చిత్ర యూనిట్ తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే రిలీజ్‌పై మరో ప్రకటన చేస్తామని ప్రకటించారు మేకర్స్.

2018 చివరిలో అధికారికంగా ప్రకటన వచ్చిన ఈ సినిమాను తొలుత 2020 జులై 30న విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత 2021 జనవరి 7వ తేదీకి మార్చారు. ఆ తర్వాత కరోనా ప్రభావం, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అక్టోబరు 13న థియేటర్లలోకి తీసుకొస్తామని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తామని చెప్పడం సహా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రచారంతో హోరెత్తించారు. అయితే ఒమిక్రాన్ కేసులు, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు, థియేటర్లు మూసివేత.. ఇలా రకరకాల కారణాల వల్ల సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

దాదాపు రూ.450 కోట్లతో దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Keeping the best interests of all the involved parties in mind, we are forced to postpone our film. Our sincere thanks to all the fans and audience for their unconditional love. #RRRPostponed #RRRMovie pic.twitter.com/JlYsgNwpUO— RRR Movie (@RRRMovie) January 1, 2022