ఐపిఎల్‌ అత్యుత్తమ కెప్టెన్‌ రోహిత్‌

ప్రశంశలు కురిపించిన గంభీర్‌

goutham gambhir
goutham gambhir

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పై, బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ప్రశంశలు కురిపించాడు. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో మాట్లాడుతు.. ఒక జట్టును ఎన్ని సార్లు విజేతగా నిలిపామన్న దానిపైనే కెప్టెన్సి ఆధారపడి ఉంటుంది. ఇది భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ముంబై ఇండియన్స్‌ సారథిగా అతను ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్‌ గెలిచాడు. తన కేరిర్‌ ముగిసేలోగా మరో మూడు టైటిల్స్‌ గెలుస్తాడు. కనీసం 6-7 సార్లు టైటిల్‌ గెలిచి మోస్ట్‌ సక్సెస్‌ పుల్‌ ఐపిఎల్‌ కెప్టెన్‌గా చరిత్రలో నిలుస్తాడని గంభీర్‌ కొనియడాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/