ఇలాంటి సమయాల్లో అన్న క్యాంటీన్లు ఉంటే ఉపయోగపడేవి

పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

Chandrababu
Chandrababu

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సీనియర్ నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాము చేస్తున్న సేవా కార్యాక్రమాల గురించి చంద్రబాబుకు వివరించారు. ‘కరోనా’ నేపథ్యంలో సరకుల పంపిణీలో అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గత పాలకులను ప్రజల్లో కించపర్చాలనే యోచన దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి సమయాల్లో అన్న క్యాంటీన్లు, ఆర్టీజీఎస్ ఉంటే ఎంతో ఉపయోగపడేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/