మళ్లీ ‘రౌడీ’ హీరోతో..

దుస్తుల బ్రాండ్‌ యాడ్‌కోసం రష్మిక

Rashmika Mandanna
Rashmika Mandanna

టాలీవుడ్‌లోకి ‘ఛలో సినిమాతో మెరుపులా వచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న.

తొలి సినిమాతోనే మంచి సక్సెస్‌ అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం, ‘దేవదాస్‌, ‘సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి..

ప్రస్తుతం అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప చిత్రంలో నటిస్తోంది..ఇపుడు సెన్సేషనల్‌ స్టార్‌ విజ§్‌ు దేవరకొండ తో రష్మిక మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతోందని సమాచారం.

ఈ జోడీ మరోసారి జోడీగా నటించబోతున్నారట..

అయితే ఈసారి సినిమాలో కాకుండా ఓ యాడ్‌ కోసం కలుస్తారని టాక్‌.. దుస్తుల బ్రాండ్‌ యాడ్‌ కోసం విజయ్ తో రష్మిక నటిస్తోంది..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/