బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

ఏపీలో మరోసారి ఎన్నికల నజరానా మోగింది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు సంబదించిన షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 8 నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటిస్తారు.

బద్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ బరిలో దిగనుంది. ఈ ఏడాది మార్చ్ 28 న అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. ఈ క్రమంలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణియో ఈ డాక్టర్‌ దాసరి సుధ. ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను బరిలో దిగుతున్నారు.