‘భీమ్లా నాయక్’ కు గాను రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

'భీమ్లా నాయక్' కు గాను రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

లీడర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి రానా…మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు నార్త్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. హిందీ లోను పలు సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి మూవీ లో భల్లాలదేవ గా పవర్ ఫుల్ విలన్ గా నటించి తన స్థాయి ని పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ లోను విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు వినికిడి.

ఈ మూవీ లోడానియల్ శేఖర్ పాత్ర చేయడానికి రానా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘భీమ్లా నాయక్’ చిత్రానికి రానా 25 రోజుల కాల్ షీట్లను కేటాయించారట. దీనికి గానూ దాదాపు రూ.4 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాబట్టే హీరో ఆ స్థాయిలో వసూలు చేస్తున్నాడని అంటున్నారు. సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రానా ఏ మేరకు ప్లస్ అవుతాడో చూడాలి. రీసెంట్ గా రానా తాలూకా టీజర్ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటుంది. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. 2022 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.