కీవ్‌ వీధుల్లో అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని బోరిస్‌

కీవ్: ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఉక్రెయిన్‌లో పర్యటించారు. రాజధాని కీవ్‌ వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి కీవ్‌ వీధుల్లో తిరిగారు. ఉక్రెయిన్‌ పౌరులకు ధైర్యాన్నిచ్చేందుకే తాను సర్‌ప్రైజ్‌ విజిట్‌ చేశానని బోరిస్‌ చెప్పారు. రష్యా విధ్వంసానికి బలవుతున్న దేశానికి అండగా నిలబడటం తమ విధి అని తెలిపారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు మరింతగా ఆర్థిక, సైనిక సాయం అందిస్తామని ప్రకటించారు. పటిష్ట భద్రత నడుమ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి వీధుల్లో తిరుగుతుండగా.. ఓ పౌరుడు జాన్సన్‌ను కలిశారు. ఆపత్కాలంలో దేశ పర్యటనకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిగా మీకు సహాయం చేయడం మా అధృష్టంగా భావిస్తున్నామని బోరిస్‌ అన్నారు. మీకు అద్భుతమైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పారు. అతడు చాలాబాగా పనిచేస్తున్నాడని కితాబిచ్చారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/