రాజ్య‌స‌భ రేప‌టికి వాయిదా

న్యూఢిల్లీ : వ‌రుస‌గా మూడో రోజు కూడా రాజ్య‌స‌భ లో విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీల‌తోపాటు ఇత‌ర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేక‌ర‌ణ‌, పంట‌ల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర‌, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఆందోళ‌నల్లో మ‌ర‌ణించిన రైతుల‌కు ప‌రిహారం విష‌య‌మై స‌భ‌లో నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఛైర్మ‌న్ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు.

విప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో ఛైర్మ‌న్ స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. ఆ త‌ర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ కావ‌డంతో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు, ఆ త‌ర్వాత 3 గంట‌ల వ‌ర‌కు స‌భ వాయిదా ప‌డింది. మ‌ధ్యాహ్నం మూడు గంట‌లకు స‌భ తిరిగి ప్రారంభ‌మైనా గంద‌ర‌గోళం కొన‌సాగ‌డంతో రాజ్య‌స‌భను రేప‌టికి వాయిదా వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/