వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేష‌న్

Rahul Gandhi nomination from Wayanad

తిరువ‌నంత‌పురం : వ‌య‌నాడ్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. 2019 ఎన్నిక‌ల్లో వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ప్రతిసారీ అభ్యర్థిని మార్చుతూ వచ్చిన సీపీఐ ఈసారి ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి ‘అన్నీరాజా’ను బరిలోకి దించింది. బీజేపీ త‌ర‌పున ఆ పార్టీ కేర‌ళ అధ్య‌క్షుడు కే సురేంద్ర‌న్ పోటీ చేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈ నియోజకవర్గం నుంచే ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. వ‌య‌నాడ్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గానికి రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా నిలిచిన అమేథీని వదులుకుని మరీ ఈ ఒక్క చోట నుంచే పోటీ చేస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.