పునీత్ మరణించినప్పటికీ ఆయన కళ్లు ప్రపంచాన్ని చూడబోతున్నాయి

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటు తో కన్నుమూశారు. ఈరోజు ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆయన ప్రాణాలు కాపాడడం కోసం డాక్టర్స్ ఎంతో ట్రై చేసారు కానీ..ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎంతో ఆరోగ్యంగా కనిపించే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో చనిపోవడం ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు.

పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నాడు.తన కళ్లను దానం చేయనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. గతంలో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన నేత్రాలను మరొకరి కోసం కుటుంబీకులు దానం చేయడం జరిగింది.

పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నిజంగా ఇది షాకింగ్. హృదయ విదారక ఘటన. పునీత్ రాజ్ కుమార్ చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి మరియు కన్నీటి సానుభూతి తెలియజేస్తున్నాను. మొత్తంగా కన్నడ , భారతీయ చలనచిత్ర రంగానికి ఇది తీరని నష్టం.. అంటూ ఈ విషాద నష్టాన్ని తట్టుకునే శక్తి అందరికీ కలగాలి అని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు.

పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యను. ఎంతగానో కలచివేసింది. నేను కలుసుకున్న అత్యంత వినయపూర్వకమైన వ్యక్తులలో పునీత్ ఒకరు. అతని కుటుంబ సభ్యులకు మరియు ప్రియమైన వారికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు మహేష్ బాబు ట్వీట్ చేశారు.