బికినీ అందాలతో రెచ్చిపోయిన పార్వతి మెల్టన్

‘ జల్సా ‘ బ్యూటీ పార్వతి మెల్టన్ బికినీ అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. వెన్నెల మూవీ తో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ..ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. పవన్ కళ్యాణ్ జల్సా, మహేష్ బాబు దూకుడు సినిమాలతో బాగానే ఫేమస్ అయింది. కానీ కెరియర్ మాత్రం ఆశించిన విధంగా స్పీడ్ కాకపోవడంతో అడ్రెస్ లేకుండాపోయింది. సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ..న్యూజెర్సీలో కొన్ని బిజినెస్ లు మొదలుపెట్టింది. వాటినిప్పడు సక్సెస్ ఫుల్ గానే నిర్వహిస్తుంది. ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది.

తాజాగా సోషల్ మీడియా లో హాట్ బికినీ పిక్స్ షేర్ చేసి వైరల్ గా మారింది. చిత్రసీమకు దూరమై కొన్ని ఏళ్లు అవుతున్న బ్యూటీ అందంలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. అదే ఫిజిక్ ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తుంది. బీచ్ లో వివిధ భంగిమల్లో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు యూత్ కు కిక్ ఇస్తున్నాయి. దీంతో అభిమానుల హాట్ కామెంట్లు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఈమె చివరగా పదేళ్ల క్రితం యమహా యమ సినిమాలో నటించింది. ఆ తర్వాత నుండి సినిమాలకు దూరమైంది.