విడుదలైన కొన్ని గంటల్లోనే షాక్

ఓటీటీకి కూడా తలనొప్పిగా మారిన పైరసీ

nishabdham poster
nishabdham poster

అనుష్క.. మాధవన్..  అంజలి.. షాలిని పాండే కీలక పాత్రల్లో నటించిన నిశ్శబ్దం సినిమా సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత నిన్న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాలో అనుష్క మూగ చెవిటి అమ్మాయి పాత్రలో నటిస్తున్న కారణంగా అంచనాలు మొదటి నుండి కూడా భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ సినిమాను రూపొందించారంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ సమయంలో చెప్పుకొచ్చారు. దాంతో సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిన్న విడుదలైన ఈ సినిమా అప్పుడే పైరసీ అయ్యింది. థియేటర్లకు పెద్ద శాపంగా మారిన పైరసి ఇప్పుడు ఓటీటీకి కూడా తలనొప్పిగా మారింది.

నిన్న అర్థరాత్రి సమయంలో విడుదలైన నిశబ్దం సినిమాను తెల్లవారే సరికి ఆన్ లైన్ లో రాకర్స్ ఉంచేశారు.ఇలా ఓటీటీ మూవీస్ ను కూడా పైరసీ చేస్తే సినిమా పరిశ్రమ బతికేది ఎలా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/