సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ బులిటిన్ విడుదల..అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఆరోగ్యం

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్ లోని కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసిన సంగతి తెలిసందే. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ హాస్పటల్ లో చేరారని విషయం తెలిసి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కృష్ణ ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. మరోవైపు అభిమానులు సైతం హాస్పటల్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

ఈ క్రమంలో కృష్ణ హెల్త్ బులిటిన్ ను హాస్పటల్ వర్గం మీడియాకు తెలియజేసారు. నిన్న రాత్రి కృష్ణ గారు గుండెపోటు తో హాస్పటల్ లో జాయిన్ అయ్యారని , 48 గంటలైతే గాని ఏంచెప్పలేమని డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటీలేటర్‌ పై ఉన్నారని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ గారు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారని , ప్రతి గంట కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన క్షేమంగా ఉండాలని కోరుకోవాలని తెలిపారు.

కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆలాగే ఆయన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక కృష్ణ మిత్రుడు కృష్ణం రాజు కూడా ఇటీవలే కన్నుమూశారు. ఇలా వరుస విషాదాలు ఆయన్ను మరింత కుంగదీసాయని తెలుస్తుంది.