తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు

24 గంటల్లో 152 నమోదు

Corona updates in telangana
Corona updates in telangana

Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 152 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా 114 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.

కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,99,406కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 2,95,821 మంది కోలుకోగా మృతుల సంఖ్య 1,637కు చేరింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/