మరో వారం రోజుల్లో ఓటిటి లో సందడి చేయబోతున్న దసరా

nani-movie-dasara-to-be-stream-from-april-27th-on-netflix

హైదరాబాద్ః నాని – కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ దసరా. భారీ అంచనాల నడుమ మార్చి 30 న పాన్ ఇండియా గా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాని – కీర్తి నటనకు యావత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మొదటి వారంలోనే దాదాపు రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమాను తొలుత మే 30న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ నెల 27 నుంచే ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేయనుంది. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.