నా ఐపిఎల్‌ ఫెవరెట్‌ మూమెంట్‌ అదే

హలో మొబైల్‌ యాప్‌లో పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్న అక్తర్‌

akthar and sharuk khan
akthar and sharuk khan

కరాచీ: భారత లెజెండరీ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రావిడ్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రీకి పాంటింగ్‌, జస్టిన్‌ లాంగర్‌లకు బౌలింగ్‌ చేయడం కష్టమని పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ అక్తర్‌ తెలిపాడు. ఆదివారం హలో మొబైల్‌ యాప్‌లో ఫ్యాన్స్‌ తో చిట్‌చాట్‌లొ ఈ విషయం వెల్లడించాడు. అలాగే ఐపిఎల్‌లో తన ఫేవరెట్‌ మూమెంట్‌ ఏంటని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. బాలివుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తనను కౌగిలించుకోవడం ఎప్పటికి మరువలేనని అన్నాడు. ఐపిఎల్‌ ప్రారంభంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరపున అక్తర్‌ ఆడగా.. ఓ మ్యాచ్‌ విజయానంతరం షారుఖ్‌ అమాంతం ఎగరి తన ఓళ్లో వాలిపోవడం ఎప్పటికి మరిపోలేనని అన్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/