నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను – ఆర్కే రోజా

జగన్ కొత్త మంత్రివర్గంలో చోటుదక్కడం తో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫుల్ హ్యాపీ గా ఉంది. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను అని తేల్చి చెపుతుంది. మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నని తెలిసి ఫుల్ హ్యాపీ గా ఉంది.

కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగన్ అన్న నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మహిళ పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈరోజు జగనన్న నన్ను మంత్రిగా చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను. మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక చెయ్యను’ అని రోజా తేల్చి చెప్పారు.

ఇక రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ముచ్చటగా మూడు మంత్రి పదవులు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామిని కొనసాగిస్తూ బోనస్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీనియర్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.