కేరళ తరహా ప్యాకేజీ ప్రకటించాలి

సిఎంకు సిపిఐ నేత రామకృష్ణ లేఖ

AmaravatiL కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేరళ తరహా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ ఎపి శాఖ కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు జగన్‌కు ఆయన ఒక లేఖ రాశారు. కరోనా కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తమైందని, ఇల్లు వదిలి రావాలంటే ప్రజలు భయపడుతున్నారని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీతో ఐక్యంగా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమైందని ఆయన తెలిపారు. కేరళ ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయిల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని,

అందరికీ నెలకు 10 కేజీల ఉచిత బియ్యం అందజేస్తోందని ఆయన తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/