జ్ఞాపకశక్తి పెరగాలంటే

ఆరోగ్య చిట్కాలు

memory is to grow

మెదడు చురుగ్గా ఉండాలన్నీ, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా పోషకాహారం తప్పనిసరి. విటమిన్‌ బి 12, విటమిన్‌ డి తక్కువగా తీసుకుంటే మానసిక కుంగుబాటు, శరీరంలో ఐరన్‌ తగ్గిపోయి అటెన్షన్‌ డెఫిషిట్‌ మైరాక్టివ్‌ డిజార్డర్‌ వచ్చే ఉంటుంది.

మెదడు రక్తప్రసరణను పెంచేందుకు అవకాడో తింటే మంచిది. అదేవిధంగా బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు, పిస్తాపప్పు వంటివి తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్‌ కె ఎక్కువగా ఉండే బ్రకోలి వల్ల ఆలోచనా శక్తి మెరుగవుతుంది.

కొలైన్‌ అనే అత్యవసర పోషకం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. సాల్మన్‌ చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడును ఆరోగ్యంగా ఉంచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

డార్క్‌ చాక్లెట్లలోని ఫ్లావనాడ్స్‌ కూడా మెదడును ఉత్సాహ పరుస్తుంది. మరి మీరు కూడా ఇలాంటి పదార్థాలు తిని జ్ఞాపకశక్తి పెంచుకోండి మరి!

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/