పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఫై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఫై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ నటుడు మంచు విష్ణు మా’ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశారు. మంగళవారం తన నివాసం నుండి ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలాలు చేసారు. అంతకు ముందు దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తమ ప్యానల్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. తమ మ్యానిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ తమ ప్యానల్‌కు ఓటేస్తారని విష్ణు ధీమా వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాన్‌ చేసిన వ్యాఖ్యలపై తన తండ్రి మోహన్‌ బాబు మాట్లాడుతారన్నారు. పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పుకొచ్చారు.

ఇక మంచు విష్ణు ప్యానల్‌ విషయానికొస్తే.. అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, ట్రెజరర్‌గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజులు పోటీలో ఉన్నారు.

అక్టోబర్ 10న జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో మంచువిష్ణు, ప్రకాశ్​రాజ్ , మరో సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో నర్సింహారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి బండ్ల గణేశ్ నామినేషన్ వేశారు.