మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Liquor policy case..Extension of Kavitha judicial remand
Liquor policy case..Extension of Kavitha judicial remand

న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. రెండు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.

కాగా.. మార్చి 26 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోండటంతో కవితను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచారు. కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నించారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయిన విషయం తెలిసిందే.