లైగర్ చూసి బాబోయ్ అంటున్న విజయ్ ఫ్యాన్స్

పూరి – విజయ్ దేవరకొండ కలయికలో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాక్సింగ్ నేపథ్యంలో కథ..మైక్ టైసన్ నటించడం..పాన్ ఇండియా గా విడుదల కావడం తో అభిమానులు ఎన్నో ఆశలతో థియేటర్స్ కు వెళ్లారు. కానీ థియేటర్స్ కు వెళ్లిన అభిమానుల ఆశలపై పూరి నీళ్లు చల్లాడు. అసలు ఇది పూరి..విజయ్ తో చేయాల్సిన సినిమానేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పూరి సినిమా అంటే పంచ్ డైలాగ్స్ , హీరో క్యారెక్టర్, అదిరిపోయే క్లైమాక్స్ , హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ , కామెడీ ఇలా చాలానే ఎక్స్పెట్ చేస్తారు. కానీ లైగర్ లో మాత్రం అవేమి లేవు.

ఏమాత్రం పసలేని డైలాగ్స్, ఎందుకురా బాబూ అనిపించే కామెడీ.. మధ్యలో హీరో నత్తి…చాంపియన్ అవ్వాలనుకునేవాడిలో ఉండే కసి హీరోలో లేకపోవడం.. కథలో ఇన్‌వాల్వ్ అయ్యే అవకాశమే దొరకకపోవడం.. ఇలా పడుతూ లేస్తూ ఫస్ట్ హాఫ్ సాగింది. ఇరాక్ సెకండ్ హాఫ్ లో ఏమైనా ఉంటుందేమో అని ఆశించిన అంతకుమించి ఉసూరనిపించేసరికి అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. చివరికి మైక్ టైసన్ వచ్చి ఏదైనా మ్యాజిక్ చేస్తారేమోనని చూస్తే అదీ వర్కవుట్ కాలేదు. ఇక సినిమాకు ఏమైనా ప్లస్ ఉందా అంటూ అది హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. హీరో క్యారెక్టరయిజేషన్‌లో సత్తా లేకపోయినా తన ఈజ్‌తో, గ్లామర్‌‌తో, స్టైల్‌తో, ఎనర్జీతో దాన్ని పైకి లేపేందుకు చాలా ప్రయత్నించాడు. ఫైటర్‌‌గా లుక్స్ పరంగానూ మెస్మరైజ్ చేశాడు. కానీ అదొక్కటే చాలదు కదా సినిమా సక్సెస్ కావడానికి. అందుకే అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఓవరాల్ గా మూడేళ్లు గా విజయ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు లైగర్..గట్టి నిరాశనే మిగిల్చింది. ఎంతో ఉత్సహంగా థియేటర్స్ కు వెళ్లిన ఫ్యాన్స్ అంత నీరసంగా బయటకొస్తున్నారు.