ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు భారత్‌ ఎదురుచూస్తోంది

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు యావత్‌ భారతదేశం ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనను పురస్కరించుకొని ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ట్రంప్‌కు అతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజ§్‌ు రుపానీ ట్వీట్‌ను జతచేశారు. గుజరాత్‌లో ప్రతి ఒక్కరూ నమస్తే ట్రంప్‌ గురించి మాట్లాడుకుంటున్నారంటూ ఆయన చేసిన ట్వీట్‌ను ప్రధాని రీట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/