త్వరలో పార్టీ ప్రారంభిస్తా: అమరిందర్‌ సింగ్‌

న్యూఢిల్లీ: త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు పంజాబ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అమరిందర్‌ సింగ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం వెల్లడించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తే.. 2022లో జరుగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.

రైతుల సమస్యలపై పోరాడుతున్న శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త్‌)తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కాగా మరో కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుతో తలెత్తిన విభేదాల కారణంగా గత నెలలో అమరిందర్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని పార్టీ అధిష్ఠానం సీఎంగా నియమించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/