రూ. 1.70 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

  • లాక్‌డౌన్‌ సంక్షోభంతో నిరుపేదలు, వలస కార్మికులకోసం ప్రత్యేక ప్రణాళిక
  • ఎంఎన్‌రేగా దినసరి వేతనం పెంపు
  • పిఎఫ్‌ కంట్రిబ్యూషన్‌చెల్లింపు
  • ఎస్‌హెచ్‌జిలకు రూ.20లక్షల హామీలేని రుణాలు
  • మహిళా జన్‌ధన్‌ ఖాతాలకు రూ.500లు
  • రైతులకు పిఎం కిసాన్‌ నిధి
  • మొదటి విడత రూ.2వేలు
  • వితంతువులు, పింఛన్‌దార్లు, దివ్యాంగులకు రూ.1000

రైతులు మొదటి విడత పిఎం కిసాన్‌ యోజన స్కీం చెల్లింపులు రెండువేలు వెనువెంటనే పొందుతారు. దేశవ్యాప్తంగా 8.7 కోట్ల మంది రైతులకు ఈ నిధులు అందుతాయి. ఇక ఎంఎన్‌రేగా నిధులు కింద వేతనాలను రూ.182నుంచి రూ.202కు దినసరి వేతనంగా నిర్ణయించారు. దీనివల్ల 50 మిలియన్ల కుటుంబాలకు మేలు జరుగుతుంది.

Nirmala Sitharaman

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ఉపశమనంకోసం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1.7 లక్షలకోట్ల ప్రణాళికను నిరుపేదలు, వలసకార్మికులకోసం ప్రకటించారు. ఈ ప్యాకేజిలో ఆహారభద్రత, నగదు బదిలీ అంశాలు కూడా ఉన్నాయన్నారు

కరోనా వైరస్‌కట్టడికి దేశవ్యాప్తంగా 21రోజుల లాక్‌డౌన్‌ప్రకటించిన నేపథ్యంలో నిరుపేద సామాన్య కుటుంబాలను ఆదుకునేందుకు అతిపెద్ద ప్యాకేజిని ప్రకటిస్తామని గతంలోనే ఆర్థికమంత్రి వెల్లడించారు.

ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్‌స్కీంలో రూ.1.7 లక్షలకోట్లు విడుదలచేయనున్నారు. వీటిలో రెండు విధానాలున్నయన్నారు.

ఒకటి నగదు బదిలీకాగా రెండోది ఆహారభద్రత విభాగాలున్నాయి. నిరుపేదలతోపాటు, వలసకార్మికుల కుటుంబాలను సంరక్షిం చేందుకు ఈ పథకం నిర్దేశించారు.

ఆర్థికమంత్రి వైద్య బీమా పథకాన్ని కూడా ఆరోగ్య కార్యకర్తలు,సిబ్బందికోసం విడుదలచేసారు.

ఒక్కొక్కరికీ 50 లక్షల వ్యక్తిగత బీమా పథకం అమలుచేస్తున్నట్లుప్రకటించారు. ఆశావర్కర్లు, శానిటేషన్‌ వర్కర్లు, ఆరోగ్యకార్యకర్తలకు ఈ స్కీం వర్తింప చేస్తున్నారని అన్నారు

వీరితో పాటు పారామెడికల్‌ సిబ్బంది, వైద్యులు, నర్సులు, 20 లక్షల మందివరకూ ఉన్న హెల్త్‌ వర్కర్లకు ఈ స్కీంద్వారా మేలుజరుగుతుందని అన్నారు

ఏ ఒక్కరినీ ఆకలిదప్పులతో ఉంచకూడ దన్నది ప్రభుత్వ నిర్ణయమని, ప్రతి ఒక్కరి సంరక్షణ ప్రభుత్వ భాధ్యత అనిఅన్నారు. ఆహార ఉత్పత్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పప్పుదినుసులు, పౌష్టికాహార ఉత్పత్తులనుసైతం అందించాలని నిర్ణయించామన్నారు.

అలాగే చేతిలో ఏ ఒక్కరు సొమ్ములు లేకుండా ఉండకూడ దన్నలక్ష్యంతో నేరుగా లబ్ది బదిలీని అందిస్తున్నట్లు వెల్లడించారు. నేరుగా వారి ఖాతాల్లోకే నగదు వెళుతుందని అన్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌యోజన పథకం కింద 80 కోట్లమంది నిరుపేదలు దేశంలో ఉన్నారని తెలిపారు

వీరందరికీ ఐదు కిలోల బియ్యం, లేదా గోధుమలు నెలసరి ఉచితంగా అందిస్తామని అన్నారు .ఇపుడిస్తున్న ఐదుకిలోలకు అదనంగా అందించటం జరుగుతుందని అన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/