ఇరాన్‌ నుండి భారత్‌కు 53 మంది భారతీయులు

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చేరుకున్న నాలుగో బృందం

4th batch of 53 Indians evacuated from Iran
4th batch of 53 Indians evacuated from Iran

న్యూఢిల్లీ: ఇరాన్‌ నుండి మరో 53 మంది భారతీయులు ఈరోజు తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దేశాల్లో ఇటలీ ఒకటి. చైనా త్వరాత అత్యధికంగా ఇక్కడ ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ దేశంలో ఇతర దేశాలకు చెందిన వారు ఉండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. భారత్‌కు చెందిన వారు కూడా అక్కడే చికుక్కపోయారు.పలు బృందాలుగా వీరిని భారత్‌కు తీసుకొచ్చారు. వీరు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చేరుకున్నారు. వీరిలో 53 మంది భారతీయులున్నారు. 52 మంది స్టూడెంట్స్ ఉంటే..ఒకరు టీచర్. వీరిని అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తమ వారు చేరుకున్నారనే సమాచారం తెలియడంతో వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 389 మంది భారత్‌కు చేరుకున్నట్లైంది. మార్చి 15వ తేదీ ఆదివారం 234 మందిని, మార్చి 13వ తేదీ శుక్రవారం 44 మందిని, మార్చి 10వ తేదీ మంగళవారం 58 మందిని భారత్‌‌ తీసుకొచ్చారు.
కాగా ఇరాన్‌లో కరోనా వైరస్‌ బారిన పడి వందలాది మంది మృతి చెందుతున్నారు. మొత్తం 724 మంది చనిపోయినట్లు అంచనా. 14 వేల మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతుండడంతో పలు ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆ దేశంలో చిక్కకపోయిన భారతీయులందర్నీ స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/