లేడీ సూపర్ స్టార్ల కొత్త సినిమా !

ఆగస్టు నెల నుంచి సినిమా షూటింగ్

ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజున సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్స్ సమంత నయనతార. సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు అదిరిపోయే కొత్త సినిమా కబురు పంపించారు.

వారిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమా గురించి అప్డేట్ అందించారు.

అయితే వీరిద్దరూ కలిసి చేస్తుంది తెలుగు సినిమా కాదండోయ్.. అది ఒక తమిళ సినిమా. ఆ సినిమా పేరు ‘కాతు వాకుల రెండు కాదల్’ అని ఖరారు చేశారు.

ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఈ అందమైన హీరోయిన్ల అభిమానులు ఎదురు చూస్తున్నారు. సమంత నయనతారలను ఒకే స్క్రీన్ మీద చూస్తే నిజంగానే కన్నుల పండుగలా ఉంటుంది.

ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయట. ఇందులో హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

సినిమాలో విజయ్ ఉన్నాడని తెలిసే సరికి సినిమా పై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇంకా విగ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరో విశేషం ఏంటంటే.. నయనతార సమంత విజయ్ సేతుపతి కలిసి నడుస్తుండటం ఇదే తొలిసారి. అంతేగాక నయనతార సమంత కలిసి నటిస్తుండటం కూడా ఇదే ఫస్ట్ ఫిల్మ్.

అయితే.. సౌత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్లు కలిసి నటిస్తుండటం మరో విశేషం.

ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమా వినోదభరితంగా సాగనుందట. నిజానికి ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కావాల్సి ఉంది.

లాక్ డౌన్ వలన బ్రేక్ పడింది. తాజాగా ఆగస్ట్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్  ప్రారంభించాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/