‘ఇంకా ఎన్నిసార్లు దేశ ప్రజలను మోసం చేస్తారు మోదీ జీ!’ అంటూ కేటీఆర్ సెటైర్లు ..

మరో రెండు రోజుల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల జరుగుతున్నాయి. ఈ సమావేశాలతో రాష్ట్రంలో మరోసారి బిజెపి vs టిఆర్ఎస్ వార్ వేడెక్కింది. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని కూడళ్లలో టీఆర్‌ఎస్‌-బీజేపీ వ్యతిరేక ఫ్లెక్సీల వార్‌ ఊపందుకుంది. సాలు దొర.. సెలవు దొర పేరుతో సీఎం కేసీఆర్‌ వ్యతిరేక ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. కౌంటర్‌గా.. బైబై మోదీ.. సాలు మోదీ సంపకు మోదీ అంటూ వ్యతిరేక ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటె టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా మోడీ ఫై సెటైర్లు వేశారు.

‘2018, ఏప్రిల్‌లో ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించామని అన్నారు. మరోవైపు ఎన్‌పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి జూన్‌ 25న కరెంట్‌ వచ్చింది. ఇంకా ఎన్నిసార్లు దేశ ప్రజలను మోసం చేస్తారు మోదీ జీ!’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

NDA రాష్ట్ర పతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్నారు. ఆమె సొంతూరు ఒడిశాలోని మయూర్‌బంజ్‌ జిల్లా, ఉపర్‌బెడా. అక్కడి ప్రజలు విద్యుత్‌ సౌకర్యం లేక ఇప్పటికీ కిరోసిన్‌ దీపాలనే వినియోగిస్తున్నారని, ఎట్టకేలకు ఆ ఊరికి కరెంట్‌ వచ్చిందని జూన్‌ 25న పలు వార్తా సంస్థలు ప్రచురించాయి. ఉపర్‌బెడాలో విద్యుదీకరణ పనులు మొదలు పెట్టామని ఒడిశా ప్రభుత్వం సైతం ప్రకటించింది. ఈ తరుణంలో కేటీఆర్ మోడీ ఫై సెటైర్లు వేశారు.