మరికాసేపట్లో భద్రాచలం కు చేరుకోబోతున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం కు చేరుకోబోతున్నారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఏరియల్ సర్వే చేయాల్సి ఉండగా , వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన బయలుదేరారు. గూడెపహడ్‌, ములుగు, గోవిందరావుపేట ,ఏటూరునాగారం మీదుగా భద్రాచలం కు రానున్నారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ పర్యటన సాగిస్తున్నారు. ఓ పక్క వర్షం పడుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. గోదావరి ముంపు ప్రాంతాలను నేరుగా పరిశీలిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ వెంట సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మరోపక్క భారీ వానలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది శాంతించింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉదృతి తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 65 అడుగులకు గోదావరి ప్రవహిస్తుంది. గోదావరి ఉదృతి తగ్గుతుండడం తో అంత ఊపిరి పీల్చుకుంటున్నారు.