అయోధ్య రామమందిరానికి కెసిఆర్‌కు ఆహ్వానం

ఇప్పటికే చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం

kcr

హైదరాబాద్ః ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు అయోధ్య కార్యక్రమానికి ఆహ్వానం అందింది. అయోధ్య వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కెసిఆర్ ను ఆహ్వానించింది.

అయితే, ఇటీవల కెసిఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన చేతికర్రతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన అయోధ్యకు వెళ్లడం దాదాపు అసంభవమనే చెప్పాలి. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

ఇప్పటికే దేశం మొత్తం శ్రీరామ నామస్మరణలో మునిగి తేలుతోంది. ఈ కార్యక్రమాన్ని టీవీ లైవ్ ద్వారా లేదా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు 22న సెలవు ప్రకటించాయి. శిల్పి యోగ్ రాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే విగ్రహం ఆలయంలోని గర్భ గుడిలో కొలువుతీరింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అవసరమైన క్రతువులు కొనసాగుతున్నాయి.