‘చందమామ’ ప్రెగ్నెన్సీ పాఠాలు!

ఫోటోలను షేర్ చేసిన కాజల్ అగర్వాల్

Kajal Aggarwal 'prenatal journey'
Kajal Aggarwal ‘prenatal journey’

భార్య కాజల్ ప్రెగ్నెంట్ అని గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చాడు. అంతేకాదు బేబీ బంప్ ఫొటోలను కాజల్ షేర్ చేసింది ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో ప్రత్యేకంగా ఓ డాక్టర్ ని కేటాయించి గౌతమ్ కిచ్లూ ప్రెగ్నెన్సీ పాఠాలు చూపిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టా స్టోరీస్ లో తన ప్రెనాటల్ క్లాసెస్ కి సంబంధించిన సెషన్ ఫొటొస్ ని షేర్ చేసింది కూడా. ప్రెనాటల్ క్లాసెస్ లో కాజల్ స్లీవ్ లెస్ టాప్ ధరించి ట్రాక్ సూట్ లో ఫ్లోర్ పై కూర్చుని కనిపించింది. డెలివరీ సమయంలో తాను తనకు పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండాలని కాజల్ ప్రెనాటల్ క్లాసెస్ లో పాల్గొంటోందని తెలిసింది. తన జీవితంలోకి ఓ బిడ్డ అడుగుపెడితే నాలోని భావోద్వేగాలని మరింత పెంచుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని ‘చందమామ’ పేర్కొంది. కెరీర్ పరంగా చూస్తే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. ఇక కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్ 2 పూర్తి కావాల్సి వుంది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/